సోమవారం ఇల్లెందు పట్టణం కొత్త కాలనీలో చైతన్యం -డ్రగ్స్ పై యుద్ధంలో భాగంగా ఇల్లెందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని జెకె కాలనీ ఉన్న కొత్త కాలనీలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

సరైన పత్రాలు లేకుండా నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను,10 ఆటోలను వెరిఫై చేసి పంపారు. ఐదు బైకులు సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ మాట్లాడారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.
