భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26.: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంగన్వాడీ ప్రాజెక్టు కూలీలైన్ సెక్టార్ అంగన్వాడీ టీచర్ జే ప్రసన్న లక్ష్మి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26. : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంగన్వాడీ ప్రాజెక్టు కూలీలైన్ సెక్టార్ అంగన్వాడీ టీచర్ జే ప్రసన్న లక్ష్మి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో సోమవారం కన్నులపండువగా జరిగిన రిపబ్లిక్ డే సంబురాలను ఆమె ప్రత్యక్షంగా వీక్షించారు. రెండు రోజులు క్రితం అధికారులు ప్రసన్న లక్ష్మిని హైదరాబాద్ పిలిచి.. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ప్రత్యేక వసతి కల్పించి గణతంత్ర వేడుకలను తిలకించే అవకాశం కల్పించారు.
