సుప్రీనేత ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాత్రి దేశంలోని పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి

టెహ్రాన్: ఇస్లామిక్ సుప్రీంనేత సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాత్రి దేశంలోని పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రోజు వారీ ఖర్చులు పెరిగిపోవడంతో జనం రోడ్లమీదకు వచ్చేశారు. వీధుల్లో ఖమేనీకి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అనేక నగరాల్లో జరిగిన నిరసన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
