ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కానీ ఆయన ఏ విషయంపై మాట్లాడతారన్నది అధికారికంగా ప్రకటించలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఈ ప్రసంగం రేపటి నుంచి అమలులోకి రానున్న GST 2.0 సంస్కరణలు, అమెరికా H1B వీసా హోల్డర్లపై విధించిన కఠిన నిబంధనలు లేదా భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల గురించి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
