ఆర్మూర్, అక్టోబర్ 15 (శ్రీరామ్ చక్రి న్యూస్):

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో, నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మరియు ఆర్మూర్ పట్టణంలోని సీ కన్వెన్షన్ హాల్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈ మరియు బి బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
దేశవ్యాప్తంగా జిల్లావారీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని నాయకులతో సమాలోచనలు జరిపారు. పార్టీ పటిష్ఠత కోసం గ్రాస్‌రూట్ స్థాయిలో నాయకత్వ మార్పులు అవసరమని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్, పిసిసి ఆర్గనైజర్లు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డా. రవిబాబు, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ బి బ్లాక్‌కి చెందిన ముఖ్య నాయకులు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో చురుకుగా పాల్గొన్నారు.

